Saturday, July 31, 2021

మరణం నా చివరి చరణం కాదు తేదీ : 16-03-2021

 మరణం నా చివరి చరణం కాదు 

తేదీ : 16-03-2021
శీర్షిక : సజీవ సాదృశ్యం ... 
కవిత సంఖ్య : 624

భిన్న పాలపుంతల  వింత ఖగోళపు 
అనంత విశ్వంలో...  స్వార్థమెరుగని 
అందాల ప్రకృతిలో అరవిరిసిన ఆనందాల  
అమిరిన ప్రాణి కోటి....అన్నీ అపురూపాలే ... 

జననం ధర్మమై...మరణం తథ్యమైనా  
పంచడము మాత్రమే తెలిసిన 
ప్రకృతి పెట్టిన బిక్ష ఈ ప్రాణం! 
పంచభూతాల సమ్మిళితం 
పాంచభౌతికమైన ఈ శరీరం ... 

ప్రకృతి నేర్పించినా.... 
పట్టు పడని మానవులు 
అధిక సంఖ్యాకులు  అదే లోకంగా 
అవకాశవాదంతో అలుముకున్నా ....   

జనన మరణాల మధ్య సాగే యానంలో 
తరగని ఆస్తుల తరువులా 
తరగల వీచే సుగంధ గాలిలా 
నురగల పరుగిడే సెలయేటిలా ..... 
పంచడము లోని ఆనందాన్ని పొదువుకుంటా.... 

మనం నడిచే దారి మౌనంగానైనా 
పదుగురికి ఊపిరవ్వాలి .... 
మరణించినా  మన పేరు 
సజీవ సాదృశ్యమై 
నాలుగు కాలాలు నిలవాలి 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment