సమాంతరరేఖలుగా సాగుదామా ....
తేదీ : 11-02-2021
శీర్షిక:
కవిత సంఖ్య :
వినువీధిలో వందలు వేల
ఉపగ్రహాలను విజయవంతం చేస్తూ
విశ్వంలో విహంగంలా
విలసిల్లడం ఒక వైపు .......
మధ్య తరగతి నడ్డి విరిచైనా
దిగువ తరగతికి ఆపన్నమై
అండగా నిలుద్దామనుకున్న
నీటి మీది రాతలొకవైపు.....
కొంతమందికైనా ఉద్యోగ
భద్రత దొరుకుతుందని
బడా బాబులకు వత్తాసులు ....
బాల్స్వా లో...
బసంతిలో ....
బలుసాకు తిని బతుకులీడుస్తున్నా ....
ధార్వీ లో దమ్ము పీలుస్తున్న
కుటుంబాలైనా .....
నచికుప్పంలో అర్ద నగ్నమైనా
ఇందిరా నాగర్ లో మొగ్గ తొడిగినా ...
ప్రణాలికలందని పాలకుల కలలే.....
సమన్వయ సాధకు లొస్తారని
ఆశించడం కాదు......
ప్రతి పౌరుడు కలలు కని
పాలు పంచుకుంటే
సాధించనిదంటూ ఉండదు.....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment