ఒక్క క్షణం
తేది: 03-02-2021
క్షణం విలువ....
సంఖ్య : 78
ఒంటికన్ను రాక్షసుల్లా
ఒక్క క్షణం పేరు జెప్పి
పోటీ పరీక్షల పిల్లలకు
చుక్క లు చూపిస్తున్న
అధికారులకు... పాలకులకు
ప్రజా ధనాలను
ఫలహారములుగ చేసి
వేలజీతభత్యాలను
వెలగపండు జేసే కార్యాలయ
వెర్రినాగన్నల బుర్రలకు ....
ఉట్టి చూపి స్వర్గాలంటూ
పిట్టకథలెన్నొ జెప్పి ఖద్దరు
చద్దర్లో దూరి నిద్దరోయే
ఉద్దెర ఆసాములకు......
ఒక్కసారి ఎన్నికైతే చాలు
లెక్కలేనన్ని తప్పులు జేసినా
జీవితాంతం పెన్షన్లు
తీసుకొనే హక్కున్న జక్కన్నలకు
అక్కరలేని *ఒక్క క్షణం* విలువ ......
ఒకవంద ఎనిమిది నంబరు
వాహన చోదకులను.......
మత్తు మందుల నిచ్చి మనిషి
ప్రాణం నిలిపే వైద్యులను....
మాతృ దేశపు సరిహద్దుల్లో
శతగ్నులు పేల్చి శత్రువుల గుండెల్ని
చీల్చి చెండాడే సైనికులను....
నింగికెగిసే అంతరిక్ష నౌకల
శాస్త్రవేత్తలు అడగితే తెలుస్తుంది....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment