Monday, July 26, 2021

సాధన 02-02-2021

 అంశం: సాధన 

శీర్షిక:  అధ్యయనం.... 
సంఖ్య: 600
***************************
పదికాలాలు వాణీ సంపదలై 
శోభించాలా.... 
పాఠకులను కుసుమ కోమలంగా 
ఆకర్షించాలా ..... 
పదుగురిలో ఒకరిగా సదా ప్రశస్తమై 
నిలవాలా..... 
పదే పదే విజయ తీరాలు 
ముద్దాడాలా ........ 

అవుతే..... 
అల్లాటప్పల పేకమేడల్లా 
తూలిపోకుండా .....  
కుప్పలుతెప్పలై కురిపించి 
కుంగి పోకుండా ..... 
అదిరిపోయే అపురూప 
గొప్ప ఆరంభాలతో ..... 
ప్రారంభమే సజీవ ప్రాణమవ్వాలి ..... 

గాలివాటమైన  మునగలా 
తూలిపోకుండా.....  
గగన కుసుమమై నక్షత్రంగా 
నిలవాలంటే .... 
గమ్యమెరిగిన జ్ఞాన మార్గాల 
గమనానికి ...... 
గరిమ గల పదసంపదల 
పథం తోడవ్వాలి.... 

సాదా సీదాగా సగటు జీవిలా 
సాగిలపడకుండా ..... 
సమున్నతమైన నాయకుడిగా 
తీర్చి దిద్దుకోవాలంటే ..... 
సందర్భోచిత షడ్రుచుల 
సమాంతర పోలికలతో ..... 
అనంత సాగర అధ్యయనాల   
సుందర జీవ తరంగమై 
వెలిగులీనాలి...... 

బరువు బాధ్యతలెరుగని 
బాటసారిలా  కాకుండా.... 
అర్హతలు యోగ్యతలు కలిగిన 
యోధుడిలా....  
అనుభవ సంయమనాల 
సారాల  కలబోతల  సాధకుడివై .... 
సమస్య ముగింపులకు సైతం 
సావధాన పరిష్కారాలు చూపాలి....  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment