లలిత గేయం
01-08-2020
శీర్షిక : కృష్ణవేణి తరంగం
సంఖ్య : 479
కృష్ణవేణీ కృష్ణవేణీ
తెలుగింటి పూబోణి
జల ధారల జీవఖని
రైతన్నల రారాణి. //2//
మరాఠలో మొదలాయె
మహాదేవుని పర్వతాన
పంచగంగ దూద్ గంగలు
పదిలంగా కలుపుకుని // కృష్ణ //
ప్రవహించి కదిలె కదా
కర్ణాటక చేరుకోనుగ
జత ప్రభలను చేర్చుకుని
ప్రవహించె తెలంగాణాకు // కృష్ణ //
తల్లి కృష్ణమ్మ తరిలెకద
తంగడిలో తెలంగాణకు
తుంగభద్ర కలుపుకుని
జోగులాంబ దాటుకుని // కృష్ణ //
జూరాల సాగర్ శ్రీశైలం
జన జీవన ఆధారం
తెలంగాణ రైతన్నలు
మాగాణులు పండించ // కృష్ణ //
నల్లమల ప్రవేశించె
నాట్యమాడి నర్తించె
ప్రకృతే పరవశించె
పాదాల కృష్ణమ్మతో.. . // కృష్ణ//
పాలేరులు మున్నేరులు
పలుకరించి సాగింది
హంసలదీవి దాటుకుని
ముచ్చటగా మూడుపాయలై
మురిపెంగ చేరేకదా సాగరాన // కృష్ణ//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment