Saturday, July 31, 2021

మనస్తత్వాలు తేది: -24-02-2021

 మనస్తత్వాలు 

తేది: -24-02-2021
శీర్షిక : హంస క్షీర నీరం ...... 
కవిత సంఖ్య : 614

ఎల్లలెరుగని మైదానం 
వర్ణములెరుగని శ్వేతము 
లోతులు కొలువలేని సంద్రం 
నియంత్రించలేని గమనం 
దృశ్యం చిక్కని గమ్యం ....మనసు 

అందమైన జీవిత కుసుమాలకు 
అతుక్కున్న ముళ్ల లాగ 
కనపడే ప్రతీ మనిషికి 
కనపడని కష్టాల సవ్వడులెన్నో..... 

కష్టాల కడలిలో మనం ఎదురీదినా 
కంట పడ్డ వారితో కలుపుగోలుగా 
దుఃఖసాగరంలో మునిగినా 
అక్కర కొరకై వచ్చిన వారిని 
కాదు లేదనకుండా .... సర్దడం... 
సర్దుకు పోవడం .....ఇదే జీవితం....  

కుళ్ళు కుతంత్రాల రాజకీయాలో .... 
మోసపూరిత అధికారతత్వమో... 
ఈర్ష్యాతత్వపు పాలి పగలో .... 
కపటత్వాల గుంట నక్కల 
దళారీ తత్వములో ...... 
నమ్మించి మోసగించే మేకవన్నె 
పులులో...... 
ఎన్నో.... ఎన్నెన్నో.... తెల్లవారితే..... 
కొదువలేని కోటి రకాలు....... 

అనుభవాల ప్రోదిలో మునిగి తేలి.... 
అనుక్షణం అప్రమత్తమై పసిగడుతూ 
హంస క్షీర నీరములా అంచనాలు 
వేసుకుంటూ అలవోకగా సాగిపోవడమే.... 
నిత్య జీవనం..... 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment