Saturday, July 31, 2021

అన్నీ ధర్మ సందేహాలే తేది: 04-03-2021

 అన్నీ ధర్మ సందేహాలే 

తేది: 04-03-2021
శీర్షిక: ధర్మ పీఠం 
సంఖ్య : 621

అనుభవ సారాల బోధనలన్నీ 
ధర్మ వర్తనమైన పాఠాలు వల్లిస్తుంటే
కళ్ళముందు  జరిగే సంఘటలేమో 
కల్లబొల్లి కథనాలై  జరుగుతుండగా ... 

కలహంసల కొలను బోలిన సంద్రమైన 
మానసమంతా సందేహాల సరస్సైన వేళ
తన గుడ్లను తానే పొదగడం మరచిన
కోకిలలా సంశయాలను ఈదడం 
మరిచి పోయిన మనిషినయ్యా....

ధర్మాన్నే ప్రాణప్రదంగా శ్వాసించే 
ప్రవచనల  ప్రచారకులైతేనేమి .. . 
ధర్మాన్ని రక్షించే పాలకులైతేనేమి....
ప్రేక్షక పాత్రలకు పరిమితమవ కుండా 
దృఢ చిత్తులై దివిటీలు చేతబూనితేనే..

ధర్మాధర్మాల వివక్షల అంతరం 
తెలియని పరివ్రాజకులైనా ...
సాదా సీదా సగటు మనుషులైనా 
సందేహాలెరుగని ధర్మపీఠం వైపు 
అడుగులేసి దీక్ష బద్ధులై  నిలవరా .... 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment