తిమిరం
తేది : 11-02-2021
సంఖ్య : 83
నింగికెగిరి తొంగి చూడగలిగే
సామర్థ్యం .....
పొరుగు గ్రహాలపై ఆవాసాలు
ఏర్పరుచుకోగలిగే అభిలాష ....
జ్ఞాన సంపన్నులమనే
జిజ్ఞాసల తరువులం .....
అయినా మానవాళిని
వెంటాడుతున్న
అజ్ఞానంధకారాల భాండం....
ప్రకృతే ప్రాణాలకు మూలమని
తెలిసినా ....
పట్టు వదలక మట్టు పెట్టే ఏ పని
ఆపలేక పోవడం.....
సేవలు మెండుగా చేసుకుని
చెల్లించుకునే రాజకీయాలలో
పెత్తనమంతా విత్తముదేనాయే .....
బిందువయేదంతా బంధువర్గమేనాయె....
ప్రజలకు చేరువ కావాల్సిందల్లా
పలహారాలై పోతున్నాయి......
కళ్ళ ముందు కదిలే చిత్రాలన్నీ
కనపడినా.... కనపడనట్టు నటించే
మానవాళికి .... రాబోయే రోజులన్నీ
తిమిర సంపదలే కదా......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment