Saturday, July 31, 2021

మాపటేల పూసే మల్లియ తేది:06-04-2021

 మాపటేల పూసే మల్లియ 

తేది:06-04-2021
కవిత సంఖ్య: 101 

ప్రభాత దినకరుడి పట్టము నుండి 
హరితములద్దుకుని మురిపముగా 
ముగ్దమనోహరమైన మొగ్గలను 
సవరించుకుని సింగారించుకుంటివే .... 

గ్రీష్మ తాపాలను దీటుగా ఎదుర్కుని  
పరిమళాల బాష్పవాయువులను
కరువుదీరా వెదజల్లి కనిపెట్టుకుని 
సాయం సంధ్యలలో అలరారెదవు .... 

దినమంతా పని సతమతాన అలసిన 
ఆడపడుచులకు అస్తరు పన్నీరుల
పరిమళ సుగంధాలై పల్లవింపజేసి
అలకలు తీర్చె ఆత్మీయ నేస్తానివి....

మాపటేల పూసే ఓ మల్లియా 
వెండి వెన్నెలలను మరిపిస్తూ   
వేయి రేట్ల చల్లదనాలను పెంచి 
పంచే చల్లని హిమపాతానివి.... 

పేరేదయినా రూపమేదయినా 
మల్లియంటేనే మనసులను కలపే
ఆత్మీయ అనురాగాల సిగ సుందరివి
భార్యాభర్తల బంధాల చిరునామావి .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment