Saturday, July 31, 2021

వాస్తవం తేది: 04-04-3021

 వాస్తవం 

తేది: 04-04-3021
కవిత సంఖ్య: 004 

స్వాతంత్ర్య సంబరాలు సద్దుమణుగంగనే.... 
తమిళములో తమ్ముల్లుగ ఇమడలేక... 
తకరారులు మొదలుపెట్టి తప్పుకున్నరు
సొంత గుర్తింపులు కొంతగూడ లేనోళ్ళు.... 

కాంగిరేసుకు కప్పంగా బతుకులు 
చెల్లించుకున్నోళ్లంతా కళ్లప్పగించంగ..
గట్టి పిండం పొట్టి శ్రీరాములు మాత్రం 
పట్టుబట్టి పాణమిడిసె 58 వ రోజున..... 

పెద్దమనుషులుగా చిత్రీకరించుకుని 
ముద్దు ముద్దుగా సుద్దులెన్నో చెప్పి 
సిత్రంగా కలుపుకునిరి తెలంగాణోల్లని 
తెలుగోల్లంటూ అనాగరీకులంటూనే .....

పట్టుమని పదినెలలు కూడా నిలువనీయక 
పట్టమందిన పీవీని ఒట్టుబెట్టి దింపేషిరి 
తెలంగాణీయుడని కాదు కాదు.. తెలివైనోడవని 
తాము కోరిన తెలుగు (తోలు)బొమ్మ  తాను కాదని .... 

సమైక్యాంద్రలో సమిధనయ్యా  నేను సైతం
తెలంగాణ నడిబొడ్డులో తేలియాడిన 
తేటతెల్లమగు పారిశ్రామిక ప్రాంతం ... 
నలుబదేండ్ల దేశ సేవలో ముచ్చటైన 
మూల పదవులు ఒక్కసారైన దక్కనీయక....... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment