Friday, July 30, 2021

సమాంతరరేఖలుగా సాగుదామా (1).... తేదీ : 11-02-2021

 సమాంతరరేఖలుగా సాగుదామా ....

తేదీ : 11-02-2021
శీర్షిక: విజ్ఞుల మౌనం..... 
కవిత సంఖ్య :  607

ప్రగతి పూల వనం 
పచ్చగా ఫరిఢవిల్లాలంటే ..... 
ఇంటిల్లిపాది కష్టపడినా 
ఇగురించి  కాలే కడుపులకు 
కాసింత అయినా గంజి నీళ్లు 
నిండుగా దొరకక పోయినా .... 
ఇబ్బడి ముబ్బడిగా కష్టపడే 
కార్మికులో  పక్క ...... 

ఇంటికొక్కరు పని చేసినా 
లెక్కలేనంత సంపదలు 
సాధించుకోగలిగే పెట్టుబడిదారులు 
ఇంకొక పక్క ....... 

అభివృద్ధి మంత్రదండపు 
ఇంధనాల ఇరుసుకు  
ఇరువైపుల నడిచే చక్రాలు.... 

యుగాలు మారినా దగాలు 
మారడం లేదాయె .....  
లిఖిత రాజ్యాంగాల రెక్కలు 
కప్పి ఉంచేవి కొన్నయితే .... 
శిక్షాస్మృతుల లొసుగులు 
గండాలను దాటించేవి మరికొన్ని.... 

అన్నీ ఉన్నవాడికి గొడుగులై 
నీడ పట్టి చాకిరీలు చేస్తుంటే ..... 
చాకిరీ చేసి చేసి కాళ్ళు చేతులు 
డొక్కల్లోకి పోతున్న లేనివాడి 
గోడు పట్టేదెవరికి..... ఇంకెన్నాళ్లు .... 
ఈ మౌనాలు..... 

విజ్ఞుల మౌనం వినాశనానికి నాంది...
వీడాల్సిన తరుణం ఆసన్నమైంది ....

నగునూరి రాజన్న 
కరీంనగర్

No comments:

Post a Comment