Friday, July 30, 2021

రథ సప్తమి తేది :19-02-2021

 రథ సప్తమి

తేది :19-02-2021
శీర్షిక: పర్వదినం 
కవిత సంఖ్య : 611

ప్రతిఫలాపేక్ష లేని 
నిరంతర పయనం 
భేద భావ మెరుగని 
హరిత జల జీవుల  సంరక్షణం .... 

పట్టు చిక్కనిదే ప్రకృతి 
గుట్టు విప్పనిదే విశ్వం 
ఎంత నేర్చుకున్నా .... 
ఎంతో నేర్చుకోవాల్సిందే..... 

సూర్యుడు.... చంద్రుడు.... 
నక్షత్రాలు.... భూమి... గ్రహాలూ.... 
అనంత విశ్వము నిండిన 
పాలపుంతలు .......  

అనుభవాల ప్రోదిలో 
అల్లుకున్న జ్ఞాన సంపదలు 
మన జీవితానికి ముఖ్య భూమికగా 
ముల్లె గట్టుకున్న మునివర్యున్ని 
గుర్తించి పూజించిన ఆర్యులు....

అనంత విశ్వములో  రవి 
నర్తనం గమనించిన పెద్దలు 
అయనం మార్పును గుర్తించి   
ఆది గురువుగా కీర్తించి  
ఘనముగా పూజించ 
పొందు పరిచిరి  రథ సప్తమి 
పర్వదినమై....  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment