అంశం : కరువు
తేది :04-02-2021
శీర్షిక : తీరే మార్గం .....
సంఖ్య : 79
అవిభాజ్యాల ఆత్మీయతలను
అనురాగాల అనుబంధాలను
సిరి సంపదల మూట ముల్లెలు
ముళ్ళు తీగలై కరువొచ్చెనా .....
బంధు మిత్రుల బాంధవ్యాలు
ఆదరింపుల పలకరింపులు
మమతలు నిండిన మమకారాలు
మాట పట్టింపులతో కరువాయెనా....
స్వార్థాలను సంచి నింపుకుని
భుజ కీర్తులను అలంకరించుకుని
కన్ను మిన్ను కానకుండా చేస్తుంటే
సాటి మానవీయతలు కరువాయెనా.....
పరిపక్వతల మానవత్వాలు
నింపుకుని ఆత్మీయతల
అనుబంధాలు అల్లుకుని
పూర్ణత్వాలను పుణికిపుచ్చుకుని
అడుగులు వేస్తే అధిగమించ గలం
అంటిపెట్టుకున్న కరువులన్నీ .....
నగునూరి రాజన్న
కరీనగరము
No comments:
Post a Comment