Friday, July 30, 2021

అక్షర ముద్ర తేది : 09-02-2021

 అక్షర ముద్ర

తేది : 09-02-2021
శీర్షిక :  అక్షరాల మాయాజాలం 
సంఖ్య 605

మనో తెరల పై నర్తించే 
ప్రతి స్పందనల కుందనాలు 
ఆకృతులై అక్షరాల రూపం 
ధరించి భావ తరంగాలకు 
బాసటై నిలుచు ........ 

పచ్చ తివాచీలపై పరుచుకునే 
హేమంతపు తుషార బిందువుల 
సోయగాలో  ..... 
ఆమని రాకలను ఆహ్వానిస్తూ 
వసంత కోయిలలు కూసే 
కూని రాగాలో ..... 

బోసినవ్వుల పాపాయిల 
ముసిముసి నవ్వుల పలకరింపులో .... 
మానవీయతలకు విలువలద్దే 
నాలుగు మంచిమాటలో..... 

చరిత్ర పేజీలకు చాలని 
పాలనల రాచ కార్యాలో ..... 
చర్విత చరణమయ్యే 
నల్ల బజారు నిత్య కృత్యాలో .... 

ఏదైనా.... 
ఏకబిగిన చదివించగలిగే.... 
మధుర మృష్టాన్న భోజనంలా.....  
చదివినా.... 
మరువలేని గొప్ప అనుభవంలా... 
పఠితులకు పంచే అక్షరాల 
మాయాజాలం...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment