Saturday, July 31, 2021

నీ తోనే జీవితం తేది: 03-03-2021

 నీ తోనే జీవితం 

తేది: 03-03-2021
కవిత సంఖ్య: 92

పల్లె ఒడిలో పెరిగిన జీవితం 
చెట్టు పుట్టల పెరిగిన వాతావరణం 
అమ్మా నాన్నల ఆత్మీయతలు 
పొరుగు వరుసల పలకరింపులు.... 

చదువులమ్మకై తీసిన పరుగులు 
కొలువులమ్మ వట వృక్షంపై వాలి 
వేర్వేరు ప్రదేశాలలో తిరిగిన వైనం
యాంత్రికమైన జీవన విధానంతో
బంధుమిత్రులకు దూరమైన విధం... 

అడుగులో అడుగేసి మూడు ముళ్ళు 
పడగానే లతలా అల్లుకున్న వైనం 
అడుగడుగున తోడై  నిలిచి 
ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ..... 

ప్రతి అభివృద్ధిలో పాదం కలిపి 
కష్ట సుఖాలలో శ్వాసగా నిలిచి 
నీవు నేనుగా మారిన క్షణమేదో 
నేను నీవుగా మారిన క్రమమేదో ..... 

జ్ఞాపకాల చిట్టా తిరగేస్తే 
నీ తోనే నా జీవితం ఎంతగా 
ఎక్కడి నుండి ... అన్నది 
గుర్తించనంతగా .... విడదీయరాని 
మన బంధం..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment