స్వేచ్చా కవిత
తేది: 16-04-2021
కవిత సంఖ్య: 109
శీర్షిక: కన్ను మూసిన కాకర్ల...
ఒక మహోన్నత నక్షత్రం
రాలిపోయిందీనాడు ....
తల్లి భారతి సేవలో తరించిన
అనన్య మేధావి అంతరించారు...
పల్లె నీడన పుట్టిన మల్లెపూవు
అల్లన గొప్ప చదువులు
అమెరికాలో కావించుకుని
తల్లి సేవలో తరించిన తన్మయుడు ....
ఎన్నారైలనెందరినో
ఏకతాటిపైకి తెచ్చిన స్ఫురద్రూపి
తానా ప్రథమ అధ్యక్షుడై
తరించాడు తల్లి సేవలో ....
అతిరథ మహారథి నాటి
ఆంధ్ర రాష్ర ముఖ్యమంత్రితో
పిలుపునందుకుని తరలివచ్చి
నిమ్సును జాతీయ స్థాయిలో
మలుపు తిప్పిన ఘనాపాఠి .....
అనితరమైన ఆయన సేవలకు
భారత ప్రభుత్వం స్పందించి
బహుగ బిరుదునిచ్ఛే .... పద్మశ్రీ
సత్కరించే సన్నుతమై గొప్పగా .....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment