Saturday, July 31, 2021

పట్టు విడుపులు తేదీ :03-03-2021

 అంశం: పట్టు విడుపులు 

తేదీ :03-03-2021
శీర్షిక: పదనిసలు... 
కవిత సంఖ్య: 620

పడిలేచే  కెరటం చూడు 
పక్షి ఎగిరే విధము చూడు 
బెట్టు లేని పట్టువిడుపులుంటేనే 
గమ్యం చేరే గమనమౌతుంది ... 

అవునంటే కాదనిలే 
కాదంటే అవుననిలే .... 
ఆటవిడుపులుంటేనే అవుతుంది 
జీవితం మాధుర్యం ..... 

పరిహాసాలకైనా పట్టుదలలకైనా 
పట్టువిడుపులే గట్టి బంధాలై నిలుచు 
సమఉజ్జీలతోనైనా సామంతులతోనైనా 
సామరస్యతలు నెలకొల్పి 
సంతసాలనందించు .....

దాంపత్య జీవితాన  సైతం 
ధనిక పేదల దాగుడు మూతలై 
దండి సంతృప్తులను 
ధారా దత్తము చేయు సుమా ! 

పట్టు విడుపులు పొదువుకుంటే
పదనిసల అడుగులేస్తూ 
మెట్టు మెట్టులో గట్టి పడుతూ
విజయ పథములో విహరించమా.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment