జాలి పడకండి ... జాగృతమవ్వండి
తేది : 17-02-2021
శీర్షిక: అప్రమత్తం .....
కవిత సంఖ్య : 610
పాలనల లోపాలో
ప్రజల బలహీనతలో ...
సత్యం సగం దూరం
పయనించే లోపు ....
అబద్దం ఆవలి గట్టు
చేరుతుందన్నట్టు.....
సాంకేతికత సౌరభంతో
ఉన్నది లేనట్టు ....
లేనిది ఉన్నట్టు.....
భ్రమింప జేస్తూ.... ఒకపక్క
అన్నపూర్ణ నా దేశం అంటూనే ...
ఇంకొక వైపు..... పిల్లల పోషకాహార
లోపాలకు పిడికెడు మెతుకులకంటూ
ప్రకటనలు గుప్పించి
పలువురి బలహీనతలతో
పరాచికాలాడుతున్నారు....
ఇలాంటి వలలు వేసే మోసగాళ్లను
గాలమేసే కేటుగాళ్లపైన ...
అస్సలు జాలిపడవద్దు.....
అప్రమత్తమై మెలుగుతూ
అసలు బాధితులకు
చేయూతలందిస్తూ ....
అవసరమైనప్పుడు మేల్కొని
కేటుగాళ్లను ఊచలు
లెక్కింప చేయాలి......
నగునూరి రాజన్న
కరి నగరము.
No comments:
Post a Comment