Saturday, July 31, 2021

చిత్ర కవిత తేది: 28-02-2021 ( scenary of birds flying in the evening )

 చిత్ర కవిత 

తేది: 28-02-2021
కవిత సంఖ్య: 90

చీకటి తెరలు మూసుకోగానే 
నారింజ రంగులు వెదజల్లుతూ 
వెలుగులీనే భానుడు తొంగి 
చూస్తూ ప్రకృతిని మేల్కొలిపే..... 

అరవిరిసిన ప్రభాతుని 
లేలేత కిరణాల వేడిలో 
అంగలార్చుకుంటున్న 
పక్షిరాజములు ప్రకృతి....

చీకటి వెలుగుల దాగుడుమూతల్లో 
చేయి తిరిగిన చిత్రకారుని ఛాయా చిత్రము
వోలె భూనబోంతరాల మధ్య నిలిచిన 
ఇనబింబం... నీటి నీడలు.. నీటి జాడలు..
కలిసి అంతరం లేని ధరణీ అంబరములాయె..... 

భూపాల సమయాన తీర్చి దిద్దిన 
భువన మోహన సుందర దృశ్యం 
మనసున నిలిచే మోహన గీతికై
నా కవితకు మూలమాయె...... 

నగునూరి రాజన్న
కరినగరము.  

No comments:

Post a Comment