మాట్లాడుదామా
తేది: 05-03-2021
సంఖ్య: 93
భావాలను బదలాయించుకుని
బాధలను సంతోషాలను పంచుకుని
సాటి మనిషితో బంధమేర్పరుచుకుని
బంధుత్వాల వారధయ్యేది *మాట*...
అమ్మది ఆత్మీయతల మాట
నాన్నది బాధ్యతల మూట
తోబుట్టువులది అనురాగాల బాట
మిత్రులది అనునయాల మాట ....
ప్రకృతితో మమేకమైతే
పల్లవించు పచ్చదనాలు
అంకురాల సంకటాలు బాపి
సేంద్రీయతల మాట విందామా!
హాలికులను పలకరించి
భరోసాలు నింపుదమా
అన్నపూర్ణలై ఆదుకుని
కన్న తల్లులోలె నిలిచేరు......
మాటే మంత్రం మాటే మధురం
ఎదురెదురుగ మాట్లాడితే
ఎల్లలెరుగని విజేతలం
విశ్వ వీధి గగనాన వీర జవానులం..
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment