పుస్తకము
22-04-2021
శీర్షిక : వెలుగు లోకం.
కవిత సంఖ్య : 14
బుడి బుడి అడుగుల నీడల్లో
అన్నయ్య అడుగుజాడల్లో చేరి
నడవాలనే పట్టుదలతో పోరి
నాలుగేళ్లకే.. ఐదేళ్లు వేయించుకుని
బడిబాటలు పట్టిన నేను ....
అక్షరాల ఆలంబనమో
పుస్తకాల మధురిమలో
వెనుదిరిగి చూడకుండా
వెంటబడి నేర్చుకున్నదే ....
గురు బోధనల కన్నా ముందే
అనుక్షణం వల్లె వేయిస్తూ
ఆనుపానులు కనిపెడుతూ
అమ్మ ప్రసాదమే అక్షర జ్ఞానమాయె....
పదివరకే చదువులాపిన
పల్లె పిల్లలతో పోల్చుకుంటే
కళ్లెదుటే కాన వచ్చే మార్పు
ఓ తరం ముందుకు నడిచినట్టు ...
పుస్తకమే ప్రాణంగా కదిలిన
నేనే ఒక ప్రత్యక్ష సాక్ష్యం..
పుస్తకం జీవితానికి కాగడగా నిలిచి
వెలుగులోకంలో విహరింప చేస్తుంది
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment