పంచుకుందాం.... రండి
తేది: 30-03-2021
శీర్షిక : మాధవ శిఖరాలు
కవిత సంఖ్య: 631
ఆవకాయ పులుసులన్నీ నాకే తెలుసు
అసలు ఉపయోగపడే విషయం తప్పా ...
మిడి మిడి జ్ఞానాల మిడత జీవితం
అజ్ఞానాల చీకటి అంధకారం .....
స్వార్థం సంచినిండా నింపుకున్న నాకు
నాదంటూ కాని సంపదేదైనా సరే...
భ్రమల ఆధిపత్యమంతా నాదే సుమా ...
జీవకోటిలో తుస్సుమనే మేధస్సున్న మొనగాన్ని...
వదిలేద్దాం అన్నీ వదిలేద్దాం ......
ఇసుమంత ఉపయోగం లేని
ఈర్ష్య ద్వేషాలను విడనాడి
మసిబూసిన మారేడుకాయలలా
కాకుండా మనసున్న మంచితనాలను
ఆత్మీయతలను ఆరబోసి
కలిసి పంచుకుందాం రండి ....
ప్రకృతితో మమేకమైన మనం
తరువులను మరిపించే
జాలి దయ కరుణలను
విరులను మరిపించే
పరిమళాలను కలబోసి
కలిసి పంచుకుందాం రండి...
మానవత్వపు గోపురాలను
అధిగమించి మాధవ శిఖరాలు
చేరే విజ్ఞాన వీచికలను విరివిగా
హృదయ కుసుమాలను విప్పార్చి
ఉమ్మడిగా పంచుకుందాం రండి ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment