Friday, July 23, 2021

ప్రాణ ధారలు... కవిత్వం.

 ప్రాణ ధారలు...   కవిత్వం. 

తేది: 25-11-2020
శీర్షిక: ప్రాణ ధారలు... 

అవును వ్రాయాల్సిందే 
భావాల ఊటను తోడితేనె 
సెలయేటి మధురిమలను 
పదుగురికి పంచవచ్చు .... 

అవును వ్రాయాల్సిందే 
ప్రకృతి సోయగాలను 
పల్లవించే పదనిసలను 
పలుకరించి పరిచయం 
చేయాల్సిందే .... 

అవును వ్రాయాల్సిందే 
నిశి చీకట్ల నిర్వీర్యాలను 
నిలువునా చెండాడి 
కాగడాలను వెలిగించాల్సిందే 
ఉదయాత్పూర్వపు ఉషోదయ
నులి వెచ్చదనాలను వెదజల్లాల్సిందే ... 

అవును వ్రాయాల్సిందే 
అప్పుడప్పుడొచ్చే అపూర్వ  
ప్రాణ ధారలను పదిలంగా
ఒడిసిపట్టుకోవాల్సిందే ..
నిక్షిప్తం చేసుకుని కావ్య కన్యకల
కనికట్టులు చూసి మురిసి 
కవితల ఖజానా నింపుకోవాల్సిందే... 

అవును వ్రాయాల్సిందే 
ఆమ్  ఆద్మీలకు  జరిగే 
అన్యాయాలకు గళం సవరించి 
శంఖారావం సంధించవల్సిందే.... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment