Friday, July 23, 2021

చిత్ర కవిత శీర్షిక : నందనవనమే తేది: 25-12-2020

 అంశం : చిత్ర కవిత

శీర్షిక : నందనవనమే
తేది: 25-12-2020
సంఖ్య: 52

శిశిరంలో ఆకు రాల్చుకుని 
నిశి చీకట్ల తెరలు తొలిగిస్తూ 
అందాలను ఆరబోసుకున్న 
వృక్షరాజంపై కపోతాలజంట 
కవిపలుకులకై ఎదురుచూస్తున్నవి....

దినకరుడు చందన వర్ణంలో 
తూరుపున నింగి నుండి తొంగి చూస్తూ  
తన నులివెచ్చని కిరణాలను విస్తరిస్తూ 
జగతిని మేల్కొలిపే సుందర ఘట్టం .... 

ప్రకృతి పరవశాలకు 
ఉదయాతపూర్వపు 
మలయమారుతం తోడవగా 
కపోతాల సయ్యాటలు కనువిందాయె ...

నేల సొంతం చేసుకోలేని
పైన అధికారాలు పొందలేని
మధ్యలోనే మిధ్య బతుకుల్లాంటి
గువ్వ గూడుల్లో నివసించే నగర 
వాసులకిది నందనవనమే.... 

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment