తనువు
తేది: 24-11-2020
శీర్షిక : మానవ కళ్యాణం...
సంఖ్య: 51
పాంచభౌతికమే ఈ శరీరం
పరమ పుణ్య ధామం.. హైందవం
అమ్మానాన్నల వరం.. అయినా
తెలియని తనాన తమదేనన్న అహం ....
అపురూపమైన అంగాల సంగమం
అందమైన అకృతే ఈ తనువుకు..
అంతర్లీనమైన మనసే మానసం
అతిసహజంగా స్పందిస్తే మానవత్వం...
అనారోగ్యాలకు అనాలోచనలకు
అతలాకుతలమే ఈ శరీరం...
ఆరోగ్యాలకు మంచి ఆలోచనలకు
అనువైన కసరత్తులు ఆలంబనవు
అన్నిపాళ్ళున్న ఆహారం తోడునిలుచు...
దివ్యాంగులను పరికిస్తే
తనువు దీనత్వం తేటతెల్లమే ...
తమ తప్పులేమి లేకపోయినా
కుప్పకూలిన తనువులు చూస్తే
నిప్పులాంటి సాదృశ్యాలు అవగతమే ...
అంధకారమైన అంగవైకల్యానికి
అచ్చుతప్పుల కారణాలనేకం
అనూహ్య శాస్త్ర సాంకేతికల నైపుణ్యం
అధునాతన అంగ మార్పిడుల చికిత్సలు ...
దేవుడి గీతలో జీవుడు దేహం మార్చుకున్నట్టు
ఆదరించే మానవత నిండితే మరో జన్మమే
అపార విలువల అవయవాల దానం
అంది పుచ్చుకుంటే అమోఘ మానవ కళ్యాణం...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment