సర్వ పిండి
గిన్నప్ప
అమ్మల చేతుల్లో
సొగసులద్దుకున్న
అరవిందము!!
గిన్నె పొత్తిళ్ళలో
పురుడుపోసుకున్న
మధురామృతం!!
అనురక్తితో
ఇంటిల్లిపాదిని
పెనవేసుకునే
ప్రేమపదార్థం!!
సామాన్య ప్రజల గుండెల్లో
తారాస్థాయిలో నిలిచి
వారిని అక్కున చేర్చుకొనే
అనురాగ మంత్రం!!
తిన్న ప్రతీసారి
గతకాలపు స్మృతులనన్ని
పొంగుకొచ్చేలా చేసే
అలల సంగమం!!
గర్వాన్ని నీరుగా మార్చి
గౌరవంగా బ్రతికించే
సాత్వికతత్వం!!
ఎంతటి ఆవేశాన్నైనా
చిటికెలో అణచివేయగల
శాంతిమంత్రం!!
బియ్యపుపిండితో
హంగు ఆర్భాటాలు లేకుండా
చేసే పల్లె వంటకం!!
నాలుక కొత్త రుచులను
కోరిన ప్రతీసారి
సరికొత్తగా దర్శనమిచ్చే
సృజనాత్మక తత్వం!!
సృష్టికర్త
బ్రహ్మ నైనా
ఆహా అనిపించే
అద్భుత వంటకం!!
కాలంతోపాటు
ప్రయాణం చేసే
అప్ డేట్ వంటకం!!
అసలుసిసలు ఈ తెలంగాణ వంటకం!! అదే మన సర్వ పిండి
తండ హరీష్ గౌడ్
No comments:
Post a Comment