అంశం: కష్టాల్ని గౌరవిద్దాం
తేది: 24-11-2020
శీర్షిక: పని ఏదైనా ఫలితం దక్కాలి.
సంఖ్య : 570
కడుపులో పేగులన్నీ
కదిలిపోతుంటేనే కద
కందకం తవ్వకమై
కంచములోకి ముద్ద దిగేది....
కనిపించిన మోడును
కసిదీరా వరసబెట్టి కొట్టి
కట్టెలను పోగుజేస్తేనే కద
కడుపులు నింపు...పోయ్యి మంటలకు...
కాసులిచ్చి మనమే కద
కళ్ళుమూసుకుని కూసొని
కాసేపు తలవంచంగానే
కత్తెఱందుకుని కాటుబెట్టు...
కడలంత కష్టాలను ఈది
కండలను పిండిగ కరిగించి
స్వేదం చిందించిన తడితోనే కద
వరి గోధుమలు పండించేది...
దద్దరిల్లే చలిపులి దరిన
ఎండా వానల్ని ఎన్నీలలుగ జేసుకుని
నిండు మనసున స్వీకరించి
సరిహద్దున పడిగాపులు కాసి
శత్రుమూకలతో తలబడుతేనే కద
ప్రజలంతా ప్రశాంతాల సేద దీరేది....
పని ఏదైనా ఫలితం దక్కాలి.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment