నగునూరి రాజన్న
శీర్షిక : కవి హృదయం
తేదీ : 24-11-2020
*********************
కనులు మూసినా కవాటాలు
తెరుచుకుని కనపడని కవ్వంతో
చిలికి కమ్మని వెన్నను జనింపజేసి
మానవీయపు విలువలనద్దే
మహత్వపు మట్టి సువాసనల పాత్ర....
ప్రకృతిలో పల్లవించే పదనిసలే
కాకుండా కాలగమనంలో కదిలే
కథా కమామీషులను కళ్ళకు కట్టినట్టు
కథా కమామీషులను కళ్ళకు కట్టినట్టు
కదం తొక్కించగల సామర్థ్యం ....
కాల మాన పరిస్థితులలో
కదిలే హృదయం చేసే కవాతు ....
కసితో కుత్తుకలు కోసే
కత్తులు సైతం చేయలేని పని.....
ఆశయాల గమ్యాలకు
ఆలోచనల గమనాలతో
అలవోకగా రూపమిచ్చి చేయు
అపురూప మార్గదర్శనం......
తెర తెల్లనిదే అయినా
ఎప్పటికప్పుడు నూతన
శోభలను సంతరించుకుంటూ
సప్తవర్ణాలతో శోభిల్ల చేస్తుంది .....
ఎప్పటికప్పుడు నూతన
శోభలను సంతరించుకుంటూ
సప్తవర్ణాలతో శోభిల్ల చేస్తుంది .....
రాగ ద్వేషాలను మరిచిపోయి
భావాలన్నీ రాశి పోసుకుని
జన పదాల మాలలకు పట్టంకట్టి
జన పదాల మాలలకు పట్టంకట్టి
అర్ధవంతపు వాక్యాలు అంకురింప
చేయడమే....
ఆత్మ సాక్షిని ఆసరాగా చేసుకుని
అణగారిన జనం కోసం అడ్డునిలిచిన
వారిని ప్రశ్నించడమే కాదు...
అప్పుడప్పుడు అగ్గిరవ్వలను సైతం
జ్వలింపజేస్తుంది ....
అణగారిన జనం కోసం అడ్డునిలిచిన
వారిని ప్రశ్నించడమే కాదు...
అప్పుడప్పుడు అగ్గిరవ్వలను సైతం
జ్వలింపజేస్తుంది ....
అలౌకిక ఊహలకు
అందమైన రూపమిస్తూ
ఆద్యంతం గుప్తమైనా క్లుప్తపరుస్తూ
సమస్యా పరిష్కారాల సానుకూలతలను
మానవీయంగా ఆవిష్కరిస్తూ అల్లుకుపోయేది .......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment