Thursday, July 22, 2021

ఏమిటో అలా

 అంశం: ఏమిటో అలా

తేది: 15-11-2020
శీర్షిక: ఎందుకోమరి.... 
సంఖ్య: 42

ఎవరైనా తిన్న రేవు 
తలవాలంటారు... కానీ 
తిన్న రేవును మరచిన 
తిక్క మనుషులు
ఎందుకోమరి.... 
ఏమిటో అలా .... 

పొంగి పొర్లిన దేశభక్తిని 
పంట కాలువల్లా పల్లవించిన 
రక్తపుటేరులను విస్మరించి 
మన దేశ పౌరుల ప్రతాపాలను 
పక్కకు నెట్టి చరిత్రలను  
మరుగు పరిచారు..... 

ఒక్క నది నీళ్లను తాగి 
అన్నదమ్ముల్లా పెరిగిన 
మన దేశ పౌరుల 
శౌర్య ప్రతాపాలను పక్కన పెట్టి 
శత్రువుల కపట గెలుపు చరిత్రలను 
పాట్యాoశాలుగా మలచిన 
దమన నీతికి దండి వారసులు ... 

ఏండ్లకేండ్లు గడిచినా 
ఎక్కడా ఎవ్వరు కిక్కుమనకుండా 
తరాలన్నీ చీకటి వాకిట 
తెల్లారకొట్టేస్తూ మారుతల్లిలా 
వ్యవహరించి
గప్ చుప్ గా చాప చుట్టేశారు... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment