అంశం: ఆత్మ సందర్శనం (సా సవ్వడి)
తేది: 16-11-2020
శీర్షిక: బంగారుమయమే భావితరం.
సంఖ్య: 43
ఆత్మ సందర్శనం
స్వార్థాల సవారీలో
సందర్భాల దౌర్భల్యాలో
మనిషి కొన్నిసార్లు చేసే పనుల
ఫలితాలను మనసు హెచ్చరించినా
ఖాతరు చేయకుండా కథ నడిపిస్తుంటాడు...
మంచి చెడుల బేరీజులు
మనిషికున్న ముందే పసిగట్టే
అంతర గూడాచారి ....
సంసృతి సంప్రదాయాలు
ఉపనిషత్తులు వేదాలు
కావ్యాలు ఖండాలు ఎన్నెన్నో
ఏకరువు పెట్టిన సాక్ష్యాలే .....
ఇన్ని తెలిసిన ఇగురవంతులకు
కొదువలేదు మనదేశాన ....
ముందు తరాలను ముదావహంగా
చూడాలనుకుంటే బాల్యమందే
భక్తి ప్రపత్తులతో భావ తరంగం
చేయగలిగితే బంగారుమయమే
ఇక మన భావితరాలు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment