అంశం: కార్తీక శోభ
తేది: 16-11-2020
శీర్షిక : కార్తీక మాసము.
సంఖ్య : 563
కొలమానమే లేని
కాల మార్పుల మహిమలు ...
మారని మనిషి చేసే
మలినములన్ని మటు మాయం
చేస్తూ కరిమింగిన వెలగపండులా
కడిగిన ముత్యములై పలు
ఓషధులను మూటగట్టుకుంటూ
కడలి చేర.. పరుగిడు పలు నదులు....
హరి హరులకెంతో విశిష్టం
కార్తీకమంటే ప్రీతీ పాత్రం
ఆచారం సంప్రదాయం
కలగలిసిన హైందవం
నదీ స్నానం ఉపవాసం
దీప జ్వాలా తోరణం దానం....
ఆకాశ పందిరి అందాలలో
తరిగిన రవి సమయాలు
పెరిగిన నిశి అవధులు
మిల మిలల వెలుగులు
విరజిమ్ముతూ మెరిసే నక్షత్రాలతో
పోటీ పడే భువిన విరిసే
జ్వాలా తోరణాలు శోభాయమానమే
కార్తీక మాసపు ఆనవాలు ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment