పద కవిత..... 69
గర్జన తరగలు “
స్వాతంత్య్రం వచ్చింది *మొదలు*
తర్జన భర్జనలు తప్పదీసిన తరాజులు
గోముఖ వ్యాఘ్రాల గోత్రనామాలు
చిత్రంగా దాచిపెట్టిన ఘన చరిత్రలు....
శతాబ్దాలనాటి సత్యాలు ఒకటొకటిగా
శబ్దభేరిలా గుండెల్లో గుచ్చుకుంటుంటే
ఏమీ తెలియని కడిగిన *ముత్యంలా*
ఎలా కపట నాటకం ఆడగలను... ?
పొరుగుల వెన్నులో చలి పుట్టించినా
పలుభాషల పండిత చాణిక్యులైనా
కట్టడి లేని కలి కాలపు రాజనీతులకు
తట్టుకోలేని విషాద చరమ గీతాలు ....
మరాఠ రైతు మాణిక్యాల మలుపులో
మద్రాసు సేద్య మహనీయుల గెలుపులో
కాడి నాడు కలిసి మోయకపోయినా
*గర్జించిన* తాలూకా గడచిన ఫలితాలు
రైతే రాజన్న నానుడికి దాఖలాలు....
*తరగలు*తరగలుగా తరలిన నేటి
హాలికులు ఆచితూచి అడుగేయాలని
జై కిసాన్ గా నినదించిన జన్మతః ఋషి
వాకిట ఆపదల అలికిడి ఇల సోకకూడదని...
చట్టాలు ఎవరికి చుట్టాలు కాకుండా
కరటక దమనక నీతులన్ని పునీతమయి
కర్షక బిల్లుల కథలు రైతుకు ఊతమవ్వాలని
నా తల్లి భారతికి వందనం .....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment