యద్భావం
తేది: 28-12-2020
శీర్షిక: తద్భవేత్...
సంఖ్య: 587
స్వార్థం సంచుల కెత్తుకుంటే
సాకు చూపించు..సర్వం నేనంటు
మానవత్వం మసలుకుందంటే
మనమంతా ఒకటేనంటుంది ....
అహం ఆకాశమంతయినా
అక్కరకు రాని చుట్టమే
అణుకువ ఆవగింజంతయినా
అణుబాంబులనే జయించు ....
పరులేవిధమై ప్రవర్తించాలని
పరిపరివిధాల అభిలషిస్తమో ...
మరి మనమెందుకు ముందుకు
పోమో స్వయం పరీక్షించుకోము ....
సప్తవర్ణాలను లిప్త కాలంలో
గుప్తంగా సంగమింప చేయగలిగే
కలల ప్రపంచాన్ని కమనీయంగా
సృష్టించుకునే సత్తా సమకూర్చుకో ....
కష్ట సుఖాలు.. కలిమి లేముల
కలబోతలయినా... అర్థంపర్థం
లేని ఆడంబరాలకు తావివ్వక
సంతోష సంబరాల జాతరలే చేసుకో ...
నీవు కోరుకునేదేదయినా
స్వేచ్చా రెక్కలను తగిలించుకోనీయి
మానవత్వపు పరిమళాల
జాడలను జోడించుకోనీయి ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment