నిశ్శబ్దాన్ని చేధిద్దాం
తేది: 30 -11-2020
శీర్షిక: నిశ్చింతల ఒయాసిస్సులు
సంఖ్య: 574
కొన్నిసార్లు నిమిషాల వ్యవధులు
కూడా నిలువలేని విషమింపులై
నిట్ట నిలువున నిర్వీర్యాల విత్తనాలు
వెదజల్లి ఎడారి ఛాయలకు మూలమైతాయి ...
తెలియని బాటసారులతో
తెల్లవార్లూ కలిసి పయనించడాలు
పొసగని పొరుగు రాజ్యాలతో
పోటీపడి పోగు చేసుకోవడం
అస్త్ర శస్త్ర విన్యాసాలు ....
అవును ...
తడారిన ఎడారి గుండెలో
నిశ్శబ్దాలను ఛేదిస్తేనే
నిశ్చింతల ఒయాసిస్సులు
నిర్మల మనో తటాకాలు
నిర్భయపు హృదయ
కవాటాల హరితవనాలు .....
కొత్త కొత్త పరిచయాలలో
కొండంత అండదండ
కలిసి మెలిసి జీవించే కాలనీలో
కమ్మని మలయమారుతంలా ....
నోరు మంచిదైతే ఊరు మంచిలా
ఎంత పెద్ద విస్ఫోటనాన్నయినా
కొంత మేర నిర్వీర్యం చేయొచ్చు
సరైన సమయంలో సరిగ్గా స్పందిస్తే.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment