Sunday, July 25, 2021

పెట్టిన అక్షరాలు తేది: 06-01-2021

 పుటం పెట్టిన అక్షరాలు 

తేది: 06-01-2021
సంఖ్య: 

అమాయకత్వం  నుండి 
చేయిపట్టుకుని అడుగులేయిస్తూ
నాగరికత వైపు నడిపించిన 
దివ్యజ్యోతులు .... 

అడుగడుగున జరిగే 
అన్యాయాలనెదిరించి 
ఆపదలను గట్టెక్కించే 
చేతి ఊతములు.... 

విశ్వ వీధిలో జరిగే 
వింతలన్నీ  విపులంగా 
ఏకరువు పెట్టించి 
ఏకబిగిన చదివించగలిగే 
చమత్కారిణులు .... 

అక్షరాలవే అయినా 
పుటం పెట్టుకుని రాజేస్తేనే 
సందర్భానికి సరిపోయి 
సందడి చేస్తాయి ..... 

ఎలా సర్దినా ఎదుటివారిని 
మెప్పించగలిగి ఎదురీదితేనే 
పచ్చగా పదికాలాలు నిలిచి 
బతుకు సార్థకమవుతుంది .... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment