చిత్రకవిత
04-01-2021
శీర్షిక :
సంఖ్య: 588
ఊహాను ఛాయల ఊపిరి
పోసుకున్న ఉనికి లేని క్రిమి
ఊపిరాడనీక ఉసురులు తీసుకుని
ఉక్కిరి బిక్కిరి చేసె విశ్వాన్ని .....
కపటబాజీల కబంధ హస్తాలలో
కరాల నృత్యం చేసిన జీవన మజిలీలు...
కాస్త కునుకు తీయు కాంతి రేఖలా
కనపడిన టీకామందుకు......
ట్వంటీ ట్వంటీలో వెన్నంటిన
శూన్యపు దైన్యాల ఎదురు చూపులకు
ఒక్కటంటె ఒక్కటే శరణ్యమై మనిషి
గుండెకు ధైర్యపు జాడలు చూపె టీకా....
అవును ఇక ఏమాత్రం
మన' సున్నా ' నువెళ్ళిపో
చేసిన తప్పిదాన్ని ఒప్పుకుని...
మడి ఆచారాలకు దడి కట్టి
నమస్కారాలను తిరస్కరించి
సంస్కారాలను సాగరంలో విసిరి
కంపులను సొంపుగా శ్వాసిస్తూ ....
శుచి శుభ్రతలను విడనాడి
స్వచ్ఛ భారతంటూ సాగదీసినా
చీమ కుట్టని మానవాళికి
కంటిమీద కునుకు లేకుండా చేసింది....
కనపడిందల్లా కబళిస్తూ
కాలుదువ్వే నైజం మారాలి...
పట్నాల చుట్టూరా చెత్త బుట్టల
కరకట్టల కంచెలు పోవాలి ....
ముందు తరాలకు ముదమగు
అందమైన విశ్వాన్ని అందించాలి
భుజం భుజం కలిపి నిలిస్తే
కానిదంటూ లేదని నిరూపించాలి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment