Friday, July 23, 2021

కార్తీక పౌర్ణమి తేది: 30 -11-2020

 కార్తీక పౌర్ణమి 

తేది: 30 -11-2020
శీర్షిక: సకల పాప హరణం
సంఖ్య:  573

మానవ అజ్ఞానానికి 
మసక చీకట్లు అమావాస్యయితే 
మస్తిష్క చైతన్యానికి  కరదీపికే 
మంచు బోలిన చల్లదనాల 
పిండి వెన్నెలలను పంచే
మచ్చ లేని వెన్నెలల పౌర్ణములు... 

కాల గణనం చాంద్రమానం 
కృతికా నక్షత్ర సంయుక్తం 
మాసానాం కార్తీకం నామకరణం 
సకల పాప హరణం ...... 

స్థితి కారక కేశవ దామోదరం
లయకారక జటాజూట శివోహం 
ఏకోన్ముఖులై జీవ జలాలను
ఆదుకునే మాసం కార్తీకం..... 

అర్ధభాగం అమ్మవారికి
అర్పించిన విశిష్టం 
అర్ధనారీశ్వరుడై  శివుడు
ఆవిర్భవించిన ప్రశస్తం ..... 

ఋతువు సంధికాలమైన 
బతుకు జీవన పోరాటం
సనాతనమో సంప్రదాయమో 
సన్నుతించి అవలంబించేది 
సన్మార్గపు సదాచారాలు సదా 
ఆరోగ్యాలకు సంజీవనులు..... 
విశిష్టమైన శివ కేశవ కార్తీకం ...... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment