బానిస
తేది: 30-11-2020
శీర్షిక: స్వయంకృతం
సంఖ్య : 55
పగ పట్టినట్టు పరిస్థితులో
పట్టి పట్టనట్టుండే ఆప్తులో
పథ నిర్దేశం లేని బతుకులో
పరి పరి విధాల వెతుకులాటలు....
కొంత మంది ఎందుకో
కోరి కోరి ఎనకబడ్డరు
నమ్మకాల తోటలో నడుస్తూనే
కావలిని నమ్మి కునుకు తీశారు...
అక్షరాల తోవలో అలసత్వాలో
ఆనందాల గమ్మత్తుల మత్తులో
అలవి కాని పొగాకు ఉత్పత్తులో
అదే పనిగ.. పరుగు పందెములో
పడుతున్న అడుగు వెనకకే ...
అటు ఇటు చూసే సరికి
ఆగమై తేరుకునే వరకు
తండ్లాట మాత్రమే మిగిలింది
తరం మారి పోయింది ....
మట్టిలో పొదిగిన మాణిక్యంలా
విత్తు అంకురమై విచిత్రంగా
నేల తల్లిని చీల్చుకొచ్చినట్టు
జూలు విదిల్చితేనే .... అడుగు
ముందో వెనకో స్వయంకృతమై
సంధించుకుంటేనే అందరితో
కలిసి నడవ గలిగేది.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment