Friday, July 23, 2021

డిసెంబర్ తేది: 01-12-2020

 డిసెంబర్ 

తేది: 01-12-2020
శీర్షిక: ఆంగ్ల సంవత్సర అంత్య మాసం ... 
సంఖ్య : 56 

ఒకటో సారి రెండొసారంటూ మరల
ఓపక్క  కంట పడని కంటకపు క్రిమి
ఓరగా తొంగి చూస్తూ మనుజుల
ఆరోగ్యాలతో దోబూచులాడుతోంది ...

మరోపక్క....
ఇకనైనా ముక్తి దొరుకునో
మానవ యుక్తికి చిక్కి
మంచి వాక్సిన్ రూపాన
చకోర పక్షుల ఎదురుచూపులకు.... 

ఆంగ్ల సంవత్సర అంత్య మాసం 
శరదృతువు చమత్కారం 
చలి పులిని ఉసిగొలిపినా 
చక్కదనమే శశి ప్రకాశాల శీతలాలు .... 

ఉదయాతపూర్వపు మంచు తెరలు 
ఉషోదయపు ఉదయ కాంతిలో   
ఉర్విపై పచ్చ తివాచీ పరకల చివరన 
ఉప్పొంగిన మంచి ముత్యాలను బోలు .... 

ఆధ్యాత్మికతకు ఆనవాళ్లయి
మరో తిరుమలగ  మురిపించు
గోదా తిరుప్పావైల గానాలతో
మారుమోగే  వైష్ణవాలయాలు.... అంతటా 

రమణీయమైన కాంతుల 
రంగవల్లుల సంక్రాంతి 
నెల ఆరంభం.... ముక్కోటి దేవతలు 
ఒక్కటై వచ్చి దర్శించు పరంధామున్ని... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment