Friday, July 23, 2021

మరుపు రాని మందారాలు తేది: 27-11-2020 (బంగారు బాల్యం )

 మరుపు రాని మందారాలు 

తేది: 27-11-2020
శీర్షిక:  బంగారు బాల్యం 
సంఖ్య : 54

బంగారు బాల్యాన చేసిన 
తింగరి పనుల తీపి గుర్తులన్నీ 
జీవిత గమనాన మిగిలిన 
మరుపు రాని మందారమాలలే ... 

ప్రాథమికం వరకు చదువు 
పరవశాలు చిందించినా 
సొంతూరు పొలిమేరలోపే 
తెలిసీ తెలియని తనమే ...

ఆరు నుంచి పది వరకు 
అందరం కలిసి అడుగులేశాము
అవతలి ఊరుకు పైచదువులంటు 
అడుగడుగున ఆస్వాదించుకుంటూ....

ప్రతిభ చూపడం చదువుల్లోనే కాదు  -

ప్రయాణంలో... ప్రతీ సీజన్లో దొరికే 

పండ్ల తోటల్లో....పంట చేలల్లో....

పల్లె వాసులను ఆట పట్టించేవారం 

వచ్చే పొయ్యే దారిలోన 
వాలిపోయే వాళ్ళం 
మూకుమ్మడిగా చేను చెలకల్లోన 
పంచుకొని తిన పలురకాలు.... 

వాగు వంతలు దాటుకుని 
వాలు గుట్టలెక్కే  వారిమి... 
కోతి కొమ్మంటూ చెట్ల మీద... 
లెక్క లేనన్ని చక్కదనాల ఆటలన్నీ
మావంతే... అడ్డగించేవారెవరు.... 
మా బంగారు బాల్యపు తీపికలలని... 

నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment