Monday, July 26, 2021

సృజన రూపాలు తేది: 29-01-2021

 సృజన రూపాలు  

సంఖ్య: 599
తేది: 29-01-2021
శీర్షిక : మానస పుత్రికలే.....

కవి చిలికితే అందమైన కావ్యం 
శిల్పి చెక్కితే పవిత్రమైన దైవం 
చిత్రకారుడి కుంచె కదిల్చితే
అపురూప చిత్ర కళాఖండం.....!!

ప్రత్యక్షంగా కనిపించినా వినిపించినా 
పరోక్షంగా ఊహించినా..... 
పాత్రలోని పదార్థం ప్రసాదంలా
పరిపక్వత సాధించాలంటే 
పరితపనలు పడైనా సరే 
పారాడు కవిత్వమై తీరాల్సిందే..... !!

హృదయ కుహారంలో 
చిరు అలజడి రేపే తత్వం 
అనుకున్న పని పట్ల కొంత 
అంకితభావం పెనవేసుకుంటే 
మనో తెరపై వెలుసు సప్తవర్ణాల 
బహుసుందర కుడ్యాలు ..... !!

మనసులు నిలిపి చిలికిన ప్రతీ కల
మనోల్లాస మానస పుత్రికనే....
సకల జనుల మదులు దోచే
సర్వ కళలు సృజనరూపాలే .... !!


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment