బాలల్లారా రారండి
మంచి మాటను
వినరండీ
అమ్మానాన్నల
ఆశయాలుగా
చదువుల బడికి
తరలండి ......
గురువుల మన్నన
పొందండి
చదువులు దండిగ
నేర్వండి // బాల //
ఆటలు పాటలు
ఆడండి
ఆరోగ్య బాటను
పట్టండి.....
స్వతంత్ర వీరుల
తెలియండి
రేపటి పౌరులుగ
ఎదగండి. // బాల//
చెట్లను బాగా
నాటండి .....
శుచి శుభ్రతల
పాటించండి.
చుక్కల్లా మీరు
మెరవండి
మొక్కల్లా ఎపుడు
ఎదగండి // బాల //
వ్యవసాయాన్ని
గమనించండి
రైతు క్షేమం
కోరండి
జవాను వీరుల
మరవద్దు
భరత మాతకు
ప్రణమిల్లండి //బాల//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment