Monday, July 26, 2021

కుబుసం విడిచిన బుస తేదీ: 28-01-2021

కుబుసం విడిచిన బుస 

తేదీ: 28-01-2021
శీర్షిక: వివేకంతో... 
సంఖ్య: 598

అక్షరాస్యతలు అందకుండా 
అవగాహనల స్థాయిలు పెరగకుండ
జాగ్రత్తపడి ఎదగనీయరు 
మత్తుమందుల పొత్తిళ్ళలో
జోకొడతారు పడుకోబెట్టి..... 

ఎదుగు బొదుగు లేకుండా
ఎప్పటికప్పుడు కొత్త కొత్త 
పన్నులేస్తూ... సున్నంలోకి 
ఎముకలేకుండా నీ నడ్డి 
విరువ చూస్తుంటరు.... 

చెప్పిందే చెప్పి చెప్పి జోరీగల్లా 
రొదపెట్టి... మనుషులేమయినా 
దేశం ఏమైపోయినా.....పట్టదు
పూట గడిస్తే చాలన్నట్టు వాళ్ళ పబ్బం..
వాళ్ళు గడుపుకుని దాటేస్తారు .... 

మత్తులు వదులుకుని
అలసత్వాలు ఆవలకునెట్టి
నిస్సతువలను పాతరేసి
అక్షరాస్యతలు పెంచుకుని
అజ్ఞానాలను అధిగమించుకుని...

వివేకాలు విచక్షణలు పెంచుకుని
కుబుసం విసర్జించిన చైతన్యంలా
అడుగడుగున అప్రమత్తతలతో
అవగాహనలు పెంచుకుంటూ
అహరహరం మనకు మనమే 
నదీ ప్రవాహమై పారుతున్న యవనికపై 
నిత్యచేతనంతో సాగితేనే.... సురక్షితం 
మనమైనా...ముందుతరమైనా...

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment