జాగృతి గేయం
తేది: 28-11-2020
శీర్షిక: యువతా మేలుకో
సంఖ్య: 572
యువతా మేలుకో
మేలు కోరి ఏలుకో
అల్లూరిగ ఆశించు
అన్యాయా లెదిరించు
అక్రమార్కుల భరతం పట్టి
అభివృద్దికి సంకేతించు ....//యువతా //
లాల్ బాల్ పాల్ లను
లఘూయించి పాటించు
లంచగొండి రాయుళ్లను
తరిమి తరిమి కొట్టు.... .//యువతా //
భగత్ సింగ్ సాహసాన్ని
బహులెస్సగ అనుసరించు
బంధు ప్రీతి దునుమాడగ
బతుకు తీరు మార్చుకోగ. .//యువతా //
మత్తు బారిన పడకుండా
యువతా తీర్చి దిద్దుకోండి
రాజకీయం రంగుల
రూపురేఖలు మార్చండి ....
//యువతా //
అటల్ మొరార్జీలను
ఆదర్శంగా తీసుకో
పారదర్శ పాలనలకు
పథకాలు రచియించు //యువతా //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment