Sunday, July 25, 2021

కొత్త ఆశలు తేదీ: 01-01-2021

 కొత్త ఆశలు 

తేదీ: 01-01-2021
కోరుకుంటున్నాను.... 
సా స సంఖ్య: 70


కొత్త సంవత్సరమనగానే 
కోటి ఆశల కోరికలుంటాయి 
కొండంత ఆనందాలతో
కొదువలేని ఆహ్లాదంతో .... 

పచ్చ పచ్చని ప్రకృతి చివుళ్ళతో 
పల్లవించే వసంతాలతో
పక్షుల కిలకిలారవాలతో
పసందైన ఆరోగ్యాలతో ....

హాయిగా అలవోకగా అలా 
అలా సాగిపోవాలని 
ఓ ఉదయాత్పూర్వపు శుభోదయాన
ఆహ్వానించాలని చలాకీగా కోరుకుంటాము....

కానీ ఇదేంటి.... 
శశిరంలో మోడువారిన 
చెట్ల సమూహాలను చూడగానే 
మూగపోయే మనసులతో..... 

నిరాశా నిస్పృహల 
నిర్లిప్తతల నీడలలో
అర్ధరాత్రి మద్దెల దరువు 
చద్ది కేకులు సుక్క మందులు    
జీవ హింసలు దీపాలార్పడం.....

గ్రెగోరియన్ కాల గమనములో పేజీ మార్పు 
గ్రీకు పద్ధతిన ఏర్పరుచుకున్న కా విభజన కూర్పు 
గ్రీన్ విచ్ రేఖ చివరన ఉదయించే మరో తూర్పు 
గిర్రు గిర్రున తిరిగే భూగ్రహానికి మరొక మలుపు.... 

అజ్ఞాన తిమిరాలను తరిమికొట్టే
వికాసాల జ్యోతి ప్రజ్వలనం 
విజ్ఞానాల విరించి ఉగాదికి.... 
అసలు పోలికే లేని అర్ధ రాత్రి 
అంట కాగే ఆంగ్ల నూతనానికి  
దీపాలార్పడం ఎలా నిర్వచించను ..... 

అందుకే  వలస పాలకుల కష్టాల బారి 
నుండి కాపాడిన నా దేశ నాయకులు 
ఒక అడుగు వేస్తే... 
నా దేశ  సంస్కృతిని కాపాడుకునే దిశలో 
నా వంతుగా.... వ్యావహారికంగా ఆంగ్ల 
సంవత్సరాలను వాడుకున్నా.... 
 నా దేశ ప్రజలంతా నా మాతృ 
దేశ విధి విధానాలను గౌరవించి...
ఇలాంటి ఉత్సవాలు జరుపుకునే పద్దతికి 
స్వస్తి  పలకాలని కొత్తగా ఆశిస్తున్నాను  

నగునూరి రాజన్న.
కరినగరము. 

No comments:

Post a Comment