Monday, July 26, 2021

మారని మనుషులు తేది: 27-01-2021

 మారని మనుషులు 

తేది: 27-01-2021
సంఖ్య: 77

ఆటవికతలనుండి అడుగులేస్తూ 
నాగరికతలవైపు నరుడు నడిచినా ....
అనువంశిక మశూచి అప్పుడప్పుడు
అమావాస్య  పౌర్ణమీలకు అలజడి 
చేస్తూనే ఋజువులు పరుస్తుంది..... 

ఓ పక్క మంచి చేసి మానవతలకు 
విలువలద్దుదామని ప్రయత్నిస్తుంటే...
మాయలో పడి వీడి పోయి..కారి పోయిన 
నాప గింజలు పగలబడి నవ్వుతూ...
కాలు దువ్వుతూ కబాడీకి సై అంటూ  
మాటి మాటికి మంట బెట్టే ప్రయత్నాలు 
చేస్తూ వెల్లగక్కుతారు విష జ్వాలలు వెకిలి తనంతో... 

సమానత్వమనే తులాభారం 
సవాలక్ష కారణాలపై ఆధారం...
అవన్నీ పక్కన బెట్టినా.......
అక్షరాస్యత, అలసత్వం,ఆరోగ్యం,
ఆరితేరిన నైపుణ్యం, దీక్షా దక్షత,
అవిశ్రాంతతలు.......ఇవేకాక ఇకపై
కొనసాగింపులతో ముడివడి ఉన్నా ... 

చేసిన పనుల్లో చిల్లు గారెలున్నాయంటూ 
గానుగెద్దుల గుండ్రంలా .....గట్టిగా
పట్టుకుని ససేమిరా మారనంటారు..... 


నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment