సత్యం వైపు పయనం
తేది 25-11-2020
శీర్షిక: శాశ్వత ప్రయోజనకారి ....
సంఖ్య : 571
ఆశే మానవుని ఊపిరి మనుగడ
ఆశయం ధర్మ సమ్మతమైనప్పుడు
గమనం న్యాయ సమ్మతమైతే
గమ్యమెప్పుడూ సత్యపథమే...
కలి ధర్మమో కాల మహిమలో
ఎటుచూసినా ఎదురు చూపులే
ఏ నోటా విన్నా కానరాని మాటే
అంజనమేసినా అగుపడని మూట ....
నిజానికి ఎప్పడూ ధైర్యమెక్కువే
స్వాతంత్ర సమర యోధులవలె
అబద్దానికి అనుక్షణం భయమే
అడుగడుగున మందలించే మనసుతో...
అవసరానికి చెప్పిన అబద్దం
గట్టెక్కించినట్టు భ్రమింపజేసినా
నిలకడమీద గెలిచేది నిజమే....
అబద్దాల అడ్డదారిలో
అడ్డంకుల ప్రయాణమే
లక్ష్యం చేరడం సందేహాస్పదమే ...
అసత్యాల గమనమెప్పుడు
తడిక పెట్టిన తగాదాలాగా ...
సత్యమెప్పుడూ సందు దూరనివ్వని
శాశ్వత ప్రయోజనకారి ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment