కనిపించని శత్రువు
తేది: 27-11-2020
శీర్షిక: కల్తీ మహమ్మారి
సంఖ్య: 573
అమ్మ చేతి వంటలు
అనురాగపు జేగంటలు
అని తెలిసినా .....
అరక్షణం అందుబాటని
ఆర్డర్లు వేసుకుంటున్నాం
అడ్డమైన నానా గడ్డి కరిచి
ఆరోగ్యాలు వల్లించుకుంటున్నాం ...
అమ్మమ్మల కాలం వంటకాలు
ఆయుష్షుకు ప్రపూర్ణాలు
అని తెలిసినా .....
ఆరాటాల బతుకు పోరాటంలో
అర్రులు చాచి పరుగెడుతున్నం
ఆరోగ్యానికి అరువులు పెట్టేసి
ఆనక జేబుకు చిల్లు పడిందని
అరిచి గగ్గోలు పెడుతున్నం....
ఆరోగ్యమే మహాభాగ్యమనే
ఆర్యోక్తి అర్థమయినా ....
అవసరాలకు అత్యవసరాలకంటూ
అలసత్వాలు ప్రదర్శిస్తూ
అలవాటుగా మార్చేసుకుని
అంగడి బతుకులకు
అంకితమై పోతున్నాము...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment