Friday, July 23, 2021

తుఫాను తేది 26-11-2020

 అంశం: తుఫాను 

తేది 26-11-2020
శీర్షిక : చిదంబరం... 
సంఖ్య: 53

హిమములైనా ఇసుకలైనా 
సంద్రమైనా ప్రకృతిలో 
పల్లవించే పదనిసలతో 
జనసంద్రమైతే  మనిషి మాటలతో 
తుఫాన్లకు నేపథ్యమే సుమా...! 

పదే పదే సూచిస్తుంది ప్రకృతి 
చిన్న సూచనలతో చిరుదరహాసంగ
మాట విని మసులుకున్నామా సరే
కాదంటే కల్లోలమయ్యే తుఫానే.... 

మర్మమెరుగని సృష్టి రహస్యాలు కొన్ని 
మానవ తప్పిదాలు ఇంకొన్ని  
మాట తప్పితే మాటు వేసే ఉపద్రవం 
మట్టు పెట్టి మాయమయ్యే చిదంబరం 

సంద్రములో వచ్చే తుఫాన్లకు 
శీతోష్ణస్థితులు కారణమైతే ....
జనసంద్రములో జనియించె 
తుఫాన్లకు మాటల తూటాలే మంత్రం ...

అహం బ్రహ్మాస్మి ...
అన్నీ జయించానని విర్ర వీగే 
అధముడు మానవుడు 
స్వార్థాలు నెత్తికెత్తకున్నాక 
సాటిరావు ఏ మంచిమాటలు ... 

కాలమో ఖర్మమో కలసి వచ్చాయి 
నివర్ తుఫాను నిగమ్ ఎన్నికలు 
ఎగిసిపడుతున్నాయి అలల మాటలకు 
ఏమవుతుందో చూడాలి శాంతపడేవరకు.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment