Monday, July 26, 2021

అన్నింటా షరతులే... తేది: 27-01-2021

 అన్నింటా షరతులే... 

తేది: 27-01-2021
శీర్షిక :  శరత్చంద్రికలే... 
సంఖ్య : 597

భవబంధాల జిగురుల చక్రములో 
సాలెగూటి కీటకంలా నలిగిపోకుండా 
క్రాంతి కారియై బాసటగా నిలిచేది 
భానుడిలా భగవద్గీతే  మనిషికి ..... 

విశాల విశ్వ విఫణి వీధుల్లో 
మానవ నిత్యావసరాల ముంగిట్లో
ఉత్పత్తి  అమ్మకాల కొనుగోళ్ల వేటలలో 
వ్యాపార వాణిజ్య ఆశల నీతుల్లో 
కస్టమర్ దేవుళ్ళ కష్టాలు దీర్చే 
కాగడాలే కలికాలపు నిబంధనలు .... 

ఋషుల్లాంటి ప్రజా క్షేత్రములో 
రుణదాతల్లాంటి అధికారుల దర్పంలో 
మిధ్య దేవుళ్ళ మిడి మిడి పాలనలలో 
అండదండల రాజ్యాంగమే .... 

మనిషి జీవిత చదరంగములో 
మంచి చెడుల మర్మ నిర్వాహణలో 
సుఖదుఃఖాల సరళ సంబాళింపుల్లో 
షరతులెప్పుడూ శరత్చంద్రికలే ......

అయినా..... 
కంచెలో నిలిచి కటిక చీకట్లను 
లెక్కచేయకుండా పొరుగు 
గుడ్లగూబలతో నిరంతరం 
పోరుకై నిలిచే జవాను సోదరులకు... 

సర్వజనావళికి  అన్నపూర్ణలై 
హలం భుజాన వేలాడుతూ 
అవని దున్నే రైతన్నల కొరకు ...
భేషరతుగా మసలవల్సిందే    
తల తాకట్టైనా పెట్టాల్సిందే....  

నగునూరి రాజన్న
కరినగరము.

No comments:

Post a Comment